Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేకాటలో 138 కేసులు

పేకాటలో 138 కేసులు

- Advertisement -

599 మంది పట్టుకున్న పోలీసులు 
రూ.14,15,917=00 స్వాదీనం
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్బంగా అక్టోబర్ 19వ తేదీ నుండి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు పేకాట ఆడుతున్న వారిని డివిజన్లో వారిగా కేసులు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం తెలిపారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం..138 కేసులు నమోదు చేయడంతో పాటుగా మొత్తం రూ.14,15,917=00 స్వాధీనం చేసుకోవడం జరిగింది అని తెలియజేశారు.

నిజామాబాద్ డివిజన్ లో మొత్తం కేసులు 42, పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులు 180 మంది, మొత్తం రూపాయలు 5,13,402, ఆర్మూర్ డివిజన్ లో మొత్తం కేసులు 44, పేకాట ఆడుతూ పట్టుబడిన మొత్తం 232 మంది, మొత్తం రూపాయలు 5,51,785=00, బోధన్ డివిజన్ లో మొత్తం కేసులు 52, పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులు 187 మంది, మొత్తం రూపాయలు 3,50,730 స్వాధీనం చేసుకున్నామని అలాగేమూడు డివిజన్ ల మొత్తం కేసులు 138 కేసులు నమోదు చేసి మూడు డివిజన్ లో పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులు మొత్తం 599 మంది పట్టుకున్నట్లు తెలిపారు. అయితే మొత్తంగా మూడు డివిజన్ ల పట్టుబడిన మొత్తం రూపాయలు 14,15,917 నగదులు స్వాధీనం చేసుకుందామన్నారు. దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలపై నియం త్రిండానికి ప్రత్యేక నిఘా, ప్రత్యేక టీం కంట్రోల్ రూం ఏర్పాటుచేయడం జరిగింది అని తెలియజేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -