Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి: కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.  గురువారం ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయు సిబ్బంది అందరు సమయపాలన పాటించాలని, ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు అందించాలని ఆదేశించారు. ఓపీ, ఐపి రోగుల వైద్య సేవలు మరింత మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు. ప్రసవాల సంఖ్యను  పెంచాలని, వంద శాంతం నార్మల్ డెలివరీలు చేయాలన్నారు.గర్భిణుల ఆంటీనెంటల్ (ANC)కేర్ నమోదు  ఖచ్చితంగా చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించి, అవసరమైన ఐరన్, కాల్షియం టాబ్లెట్లు సమయానికి అందించాలన్నారు.

హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న గర్భిణీలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గర్భిణీల పల్స్ రేట్ చెకప్, స్కానింగ్ సమయానికి జరిగేలా చూసి, వారు సమయానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తూ ఉండేలా ప్రోత్సహించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. బేబీ వార్మ్, స్టెరిలైజేషన్ పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ల్యాబ్ రిపోర్టులు సమయానికి అందజేయాలని,సబ్ సెంటర్లలో వ్యాక్సినేషన్  సమయానికి అందించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన అన్ని టాబ్లెట్లు ఉండాలని సూచించారు. గ్రామాలలో 30 సంవత్సరాలకు పైబడిన వారిని గుర్తించి వారిలో లో బి.పి, షుగర్ లాంటి వ్యాధులను గుర్తించి అవసరమైన మందులు అందజేయాలన్నారు. 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గర్భిణీ స్త్రీలతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక గర్భిణీ  మహిళ మాట్లాడుతూ, “ఇది నా మూడో ప్రసవం. గత రెండు డెలివరీలు గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగాయి, అక్కడ అన్ని విధాల సౌకర్యాలు లభించాయని తెలిపారు. ప్రస్తుతం కూడా వైద్య సిబ్బంది ప్రతి దశలో మాకు మార్గదర్శకత్వం అందిస్తూ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు.

తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అధికారులను ఆదేశించారు. ఇటిక్యాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి భూ భారతి  రిజిస్ట్రేషన్ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. భూ భారతీ రికార్డులు స్పష్టంగా, అప్-టు-డేట్‌గా ఉంచడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలను సమయానికి, పారదర్శకంగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో  తహసీల్దార్ వీర భద్రప్ప, డాక్టర్  అనిరుధ్, రెవిన్యూ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -