Tuesday, May 13, 2025
Homeజాతీయంమోడీ ప్రసంగంలో ట్రంప్ ప్రస్తావన ఎందుకు లేదు?

మోడీ ప్రసంగంలో ట్రంప్ ప్రస్తావన ఎందుకు లేదు?

- Advertisement -
  • కపిల్ సిబాల్

నవతెలంగాణ హైదరాబాద్: పాకిస్థాన్‌తో భారత్‌ సాగించిన కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం చేసుకున్నా ప్రధాని మోడీ తన ప్రసంగంలో అమెరికాను కాని, ట్రంప్‌ను కాని ఎందుకు ప్రస్తావించలేదని రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. కాల్పుల విరమణపై కుదిరిన అవగాహన గురించి కూడా ప్రధాని వివరణ ఇవ్వలేదని ఆయన అన్నారు. మోడీ సోమవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని సిబల్‌ ప్రస్తావిస్తూ సాయుధ దళాల పరాక్రమాన్ని తాము కీర్తిస్తామని, పాకిస్థాన్‌కు దీటుగా జవాబిచ్చినందుకు దేశ ప్రజలంతా సాయుధ దళాలకు జైకొడతారన్నారు. కాల్పుల విరమణకు తాము మధ్యవర్తిత్వం వహించామని ట్రంప్‌ చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. భారత్‌, పాక్‌ మధ్య అణు యుద్ధాన్ని తాము ఆపామని, యుద్ధాన్ని ఆపితే పెద్ద ఎత్తున వాణిజ్యం చేస్తామని కూడా తాను రెండు దేశాలకు చెప్పానని ట్రంప్‌ ప్రకటించారని చెప్పా రు. అమెరికాను కానీ, ట్రంప్‌ను కానీ ఎందుకు ప్రధాని ప్రస్తావించక లేదని సిబల్‌ ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -