నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌పై భారత్ ప్రతీకార దాడి చేసిన విషయం తెలిసిందే. ఏప్రీల్ 22 నుంచి మే10 వరకు రెండు దేశాల ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నాయి. దీంతో జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పలు స్కూల్స్ తాత్కాలికంగా మూసివేశారు, రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్-పాక్ మధ్య అంగీకరించడంతో ఆయా దేశాల్లో శాంతియుత వాతావరణం నెలకొంది. భారతదేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు చల్లబడ్డాయి. డ్రోన్లు, బాంబుల మోత లేకపోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ జమ్మూలోని పలు ప్రాంతాల్లో స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు తెరుచుకున్నాయి. సరిహద్దు ప్రాంతాలు మినహా జమ్మూ కశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలు మంగళవారం తిరిగి తెరచుకున్నాయి. అదేవిధంగా వ్యాపార సముదాయాలు తెరుచుకన్నాయి. ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సాగుతున్నాయి. రెండు దేశాల మధ్య తొందరగానే కాల్పుల విరమణ ఒప్పందం జరగడం శుభపరిణామం అని స్థానికులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బార్డర్‌కు అతిసమీపంలో ఉన్న పలు ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. పాక్ నుంచి ఈ తరహా దాడి జరిగిన తిప్పికొట్టేందుకు భారత భద్రతా బలగాలు సంసిద్ధంగా ఉన్నాయి. అదనపు బలగాలతో భద్రతను పెంచి, సరిహద్దు ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టారు ఆర్మీ అధికారులు.