Friday, October 24, 2025
E-PAPER
Homeఖమ్మంవరి కోత మిషన్ తగిలి తెగిపడ్డ విద్యుత్ తీగలు..తప్పిన ప్రమాదం

వరి కోత మిషన్ తగిలి తెగిపడ్డ విద్యుత్ తీగలు..తప్పిన ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ- దుమ్ముగూడెం : దుమ్ముగూడెం మండలంలోని కే లక్ష్మీపురం బ్రిడ్జి సమీపంలో వరి కోత మిషన్ తో వెళ్తున్న ట్రాక్టర్ వేలాడుతున్న విద్యుత్ తీగల కు తగలడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ తో తీగల తెగిపోయాయి.. ఆ సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ తో ట్రాక్టర్ ఇంజన్ ముందు భాగం టైర్లు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ అయిన సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. మంటలు చెల్లరేగుతున్న సమయంలో వారిద్దరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న విద్యుత్ షాక్ సిబ్బంది సప్లై నిలిపి హుటా హుటిన ఘటన స్థలానికి వెళ్లారు. అనంతరం విద్యుత్తును పునరుద్ధరించారు. షార్ట్ సర్క్యూట్ ఆయన సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడడం వలన ప్రాణపాయం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై నవతెలంగాణ విద్యుత్ శాఖ ఏఐ మోహన్ రెడ్డిని అడుగగా ఆ ప్రాంతంలో హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -