Tuesday, May 13, 2025
Homeజిల్లాలుగొల్కొండలో రెచ్చిపోయిన మందుబాబులు..

గొల్కొండలో రెచ్చిపోయిన మందుబాబులు..

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఓ మూల హత్యలు, లైంగికదాడులు జరుతూనే ఉన్నాయి. సాయంత్రం అయిందంటే చాలు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సోమవారం రాత్రి గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు తాగుబోతులు హల్‌చల్‌ చేశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గోల్కొండలో ఉన్న ఓ కటింగ్‌ షాప్‌లోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. కటింగ్ షాపు యజమాని నిజామ్‌పై దాడికి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న వస్తువులన్నింటిని పగులగొట్టారు. సామాన్లు అన్నింటిని చిందరవందరగా పడేశారు. ఈ సందర్భంగా స్థానికులు వారిని అడ్డుకోగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -