నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజిస్వీ యాదవ్ ఏన్డేయే కూటమిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్డేయే కూటమి భాగస్వామి నితిష్ పాలనలో అవినీతి, నేరాలు రాష్ట్రంలో మితిమిరి పోయ్యాయని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా క్రైం రేటు విపరీతంగా పెరిగిపోయిందని మండిపడ్డారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే..అవినీతిలేని, నేరాలను తగ్గిస్తామని పాట్నాలో మీడియా సమావేశంలో తేజిస్వీయాదవ్ హామీ ఇచ్చారు.
ఎన్నికల సందర్భంగా సాధ్యమయ్యే హామీలనే తాము ఇచ్చామని, ప్రజలను మోసం చేసే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే..క్రైం ఫ్రీ రాష్ట్రంగా బీహార్‌ను తీర్చిదిద్దుతామని తేజిస్వీ యాదవ్ దీమా వ్యక్తం చేశారు. నితిష్ పాలనలో బీహార్ వ్యాప్తంగా కుంభకోణాలు విపరీతంగా పెరిపోయయాని, కానీ ఎన్డేయే సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
ప్రధానమంత్రి స్వయంగా నితీష్ కుమార్ చేసిన 55 కుంభకోణాల జాబితాను ప్రస్తావించారు. ఏ చర్యలు తీసుకున్నారు? కుంభకోణాలు జరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోనప్పుడు, అది జంగిల్ రాజ్. కాల్పులు, హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు లేని ఒక్క రోజు కూడా బీహార్‌లో లేదు… మొత్తం దేశంలోనే అత్యధిక నేరాల రేటు ఉత్తరప్రదేశ్‌లో ఉంది. బీహార్ రెండో స్థానంలో ఉందని తేజిస్వీయాదవ్ గుర్తు చేశారు.



