జాతీయ స్థాయి పద్య , సాంఘిక నాటిక పోటీలు
శాస్త్రీయ జానపద నృత్య ప్రదర్శనలు
కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం
మిర్యాలగూడ సంస్కృతిక కళాకేంద్రం ఆధ్వర్యంలో జాతీయస్థాయి పోటీలు
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ సంస్కృతిక కళాకేంద్రం ఆధ్వర్యంలో ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి జరగనున్న పోటీలలో నందిని అవార్డ్స్-2025 పేరుతో జాతీయ స్థాయి పద్య, సాంఘిక నాటిక పోటీలు శాస్త్రీయ జానపద నృత్య ప్రదర్శనలను నిర్వహిస్తున్నామని మిర్యాలగూడ సంస్కృతిక కళాకేంద్రం అధ్యక్షులు పరిమి రామావతారం, ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి, కోశాధికారి పుల్ల పట్ల వెంకట లక్ష్మీనారాయణ శర్మ, ప్రచార కార్యదర్శి ఉపేందర్ లు తెలిపారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పద్య నాటక సాంఘిక నాటిక పోటీలకు నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తులను స్వీకరించబడతాయని తెలిపారు. వచ్చిన దరఖాస్తులలో ప్రాథమిక పరిశీలన 2026 జనవరిలో నిర్వహిస్తామన్నారు.
జాతీయ పోటీలు మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతిలో 7 మార్చి2026 నుండి 15 మార్చి2026 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులలో 8 పద్య నాటకాలు 8 సాంఘిక నాటకాల సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి జనవరిలో పోటీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఈసారి నాటక, నాటిక పోటీలలో పాల్గొనే కళాకారులకు పారితోషికం రూ 50 వేల రూపాయలు అందజేయన్నట్లు తెలిపారు. అదేవిధంగా జాతీయపద్య నాటక ప్రధమ బహుమతి రూ 50 వేల, ద్వితీయ బహుమతి రూ 40 వేల, తృతీయ బహుమతి 30 వేల రూపాయలు అందజేయనున్నట్లు చెప్పారు.
సాంఘిక నాటిక పోటీలలో ప్రథమ బహుమతి రూ 25, వేలు, ద్వితీయ బహుమతి రూ 20, వేలు, తృతీయ బహుమతి రూ 15, వేల రూపాయలు అందజేసినట్లు తెలిపారు కళాకారులు అందరికీ సర్టిఫికెట్లు తోపాటు ఉత్తమ పద్య నాటక సాంఘిక నాటిక పోటీలలో ప్రతిభ చూపిన వారికి “నందిని అవార్డ్స్” అందజేయనున్నట్లు వివరించారు. నూతన రచన నాటక, నాటికలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. ప్రాథమిక పరిశీలనలో పాల్గొన్న న్యాయ నిర్ణేతల నిర్ణయం మేరకే నాటక నాటికలు ఎంపిక చేయబడతాయని ఎలాంటి ఆక్షేపణలు అంగీకరించబడవని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సహాయ కార్యదర్శి ఆర్ వీర ప్రతాప్, సభ్యులు ఎల్లయ్య, సత్యనారాయణ తదితరులున్నారు.
నందిని అవార్డ్స్ 2025
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



