Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంట నష్టం.. పరిహారం కష్టం..!

పంట నష్టం.. పరిహారం కష్టం..!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : నాలుగేళ్లుగా జూలై, ఆగస్టు నెలల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తాడిచెర్ల, మల్లారం, దెబ్బగట్టు, కేశారంపల్లి, పివినగర్, కొయ్యుర్, వళ్లెంకుంట, కుంభంపల్లి గ్రామాల్లోని మానేరు పరివాహక ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ ద్వారా వరి పంట నీట మునిగి,పొలాల్లో ఇసుక మెటలు పెడుతూ, వరదలకు  పూర్తిగా తుడిచిపెట్టు కుపోతున్నాయి.మిడ్ మానేరు నీటి విడులతో పొలాలు, మోటార్లు సైతం కొట్టుకపోతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పంటలు చేతికొచ్చే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలకు పత్తి, వరి, మిర్చి పంటలు చేతికిరాకుండా పోవడంతో రైతులు నష్టాల ఊబిలో కురుకపోతున్నారు. పంట నష్టపరిహారం కోసం వ్యవసాయ అధికారులు సర్వేలు చేసి, అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపడం వరకు మాత్రమే జరుగుతుంది తప్పా గత నాలుగేళ్ళ నుంచి రైతులకు రూపాయి నష్టపరిహారం వచ్చిన దాఖలాలులేవు. నష్ట పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -