27న కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన
నవతెలంగాణ – ఆర్మూర్
2024 ఏప్రిల్ నుండి ఉద్యోగ పదవి విరమణ పొందిన వారి బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27 న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుటి నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్. సుకూ న్, ప్రధాన కార్యదర్శి ఎల్. శ్రీధర్ లు శనివారం తెలిపారు. 2024 ఏప్రిల్ నుండి పదవి విరమణ పొందిన వారి బెన్ఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల అనేకమంది పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పెళ్లిళ్లు గాని ఇంటి కొనుగోలు, ఇతరత్రా ముఖ్య అవసరాల కొరకు , బ్యాంకులో ఉన్న అప్పులు చెల్లించడానికి గత 19 నెలలుగా ఉద్యోగ ఉపాధ్యాయులు బెనిఫిట్స్ కొరకు ఎదురు చూడడం పెన్షనర్లను ప్రభుత్వం వంచించడమే అవుతుంది.
ఈ 19 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 మంది ఉద్యోగులు తీవ్రమానసిక ఒత్తిడికి ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకోవడం, గుండెపోటుతో మరణించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెన్షనర్ల బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 27న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించబోయే నిరసన అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పెన్షనర్లకు ఉద్యోగస్తులకు విజ్ఞప్తి చేసినారు.
పెన్షనర్ల బెన్ఫిట్స్ ను తక్షణమే విడుదల చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



