పరీశీలన, పరామర్శ, ఓదార్పు లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆంధ్రప్రదేశ్, జీలుగుమిల్లి మండలం, కామయ్యపాలెంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించారు. గ్రామంలోని వీరంకి ప్రసాద్ దశ దిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం అశ్వారావుపేట మండలంలో పర్యటించిన ఆయన పలు గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల స్థితిగతులను పరిశీలించారు.త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. అలాగే ఉసిర్లగూడెం వినాయకపురం గ్రామాలలో శుభకార్యాలలో పాల్గొన్నారు. దొంతికుంటలో నూకాలమ్మ అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



