నవతెలంగాణ – ఆలేరు
ఆలేరు నియోజకవర్గంతో పాటు యాదాద్రి జిల్లా మొత్తంగా 82 వైన్ షాపులకు లక్కీ డ్రా రేపు 11 గంటలకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో డ్రా ప్రక్రియ మొదలవుతుందని ఎక్సైజ్ సూపర్డెంట్ విష్ణుమూర్తి చెప్పారు. ఆదివారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్ అధికారులు ఈ లక్కీ డ్రా లాటరీ పద్ధతిన వైన్స్ కేటాయింపులు అన్ని మండలాల ఎక్సైజ్ సిఐలు ఎస్సైలు పాల్గొన్నట్లు చెప్పారు. 2776 మంది ఆశావాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
టెండర్లు వేసిన వారు ఉదయం 10 గంటల వరకు ఏ ఫోర్ షాపులకు సంబంధించి2025 నుండి 2027 నవంబర్ 30 వరకు ప్రభుత్వం లాటరీ ద్వారా కేటాయిస్తుందన్నారు. 6 ,9, 66, 68, 69. నెంబర్లు కన్ఫ్యూజ్ కాకుండా యారో మార్క్ పెట్టినా నెంబర్లు బాక్స్ లో వేయబడుతుందన్నారు. లాటరీ ద్వారా షాపు వచ్చినవారు 24 గంటలు 55 లక్షల రెంటల్లు ఉన్న షాపుకు 9 లక్షల 17 వేల రూపాయలు 60 లక్షల రెంటల్ ఉన్న షాపు 10 లక్షల రూపాయలు చెల్లించాలన్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి లోని రాజేంద్రనగర్ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 10 గంటల సమయానికి టెండర్ లో పాల్గొనే అభ్యర్థులు చేరుకోవాలన్నారు.



