- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో 13 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన 100 అయస్కాంతాలను మింగడంతో తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. ఎక్స్‌రేలో 80 నుంచి 100 అయస్కాంతాలు పేగుల్లో చిక్కుకుపోయి దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. 2013 నుంచి అక్కడ అయస్కాంతాలు నిషేధం ఉన్నా ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా అమ్ముతున్న టెము కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -



