నవతెలంగాణ-హైదరాబాద్: నవంబర్ నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాతో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడబోతోంది.తొలి టెస్ట్ నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్‌కతాలో, రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి 26 వరకు గువాహటిలో జరగబోతున్నాయి.
ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మందితో కూడిన జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవిల్డ్ బ్రెవిస్, టోని డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హార్మర్, మార్కో యెన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్‌క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుస్వామి, కగిసో రబాడా, ర్యాన్ రికెల్‌టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరినె.



