నవతెలంగాణ-హైదరాబాద్: బీహర్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి ప్రధాన కూటములైన ఎన్డేయే, ఇండియా బ్లాక్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు సన్నద్థమవుతున్నాయి. ఈక్రమంలో ఇండియా బ్లాక్ లో ప్రధాన పార్టీ కాంగ్రెస్ 40మందితో ఆ పార్టీ స్టార్ క్యాపెయినర్లను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6న మొదటి దఫాలో 121 స్థానాలకు ఎన్నికులు జరగనున్నాయి. దీంతో ఉన్న సమయాన్ని సద్వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించడానికి కాంగ్రెస్ పకడ్బందీగా ప్లాన్ రచించింది. ఈక్రమంలోనే ఆ పార్టీ అగ్రనేతల పాటు బీహార్ ప్రతిపక్షం ఆర్జేడీతో కలిసి మరో యాత్రకు శ్రీకారం చుట్టింది. అక్టోంబర్ 29న ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ అగ్రనేత తేజిస్వి యాదవ్ సంయుక్తంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఆ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ నియోజకవర్గం నుంచి దర్భంగా వరకు ఎలక్షన్స్ క్యాపెయిన్ చేపట్టనున్నారు.
ఈసీ చేపట్టిన ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను వ్యతిరేస్తూ…ఇరువురు నేతలు కలిసి ఓటర్ అధికార్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రకు బీహార్ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. ప్రతి నియోజవర్గంలో అగ్రనేతలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఓట్ల చోరీ ఉదంతంపై బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం భాగస్వామ్యం ఉందని, బీహారీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాహుల్ గాంధీ, తేజిస్వియాదవ్ చెప్పారు. దీంతో ఇదే తరహా ఎన్నికల ప్రచారంలో భాగంగా మరో యాత్ర చేపట్టాలని కాంగ్రెస్, ఆర్జేడీ కృతనిశ్చయంతో ఉంది. అందుకు తగ్గట్లుగా సన్నాహాలు మొదలు పెట్టింది. ఈక్రమంలోనే ఈనెల 29న ఇరువురు కలిసి ముజఫర్‌పూర్ నియోజకవర్గం నుంచి దర్భంగా వరకు ఎలక్షన్స్ ప్రచారం చేపట్టనున్నారు.



