నవతెలంగాణ-హైదరాబాద్: రాజకీయ సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు సంబంధించి పది రోజుల్లోగా ముసాయిదా ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్‌ఒపి) రూపొందించాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నవంబర్11లోగా ముసాయిదా ఎస్‌ఒపిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్రమోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి.అరుల్‌మురుగన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. లేని పక్షంలో రాజకీయ సమావేశాలకు పదిరోజుల ముందుగా అనుమతి తీసుకోవాలని, కనీసం మూడు రోజుల ముందుగానే పోలీసులు వాటిని పరిష్కరించాలని అడ్వకేట్ జనరల్ జె.రవీంద్రన్‌కి సూచించింది.
కరూర్ ప్రమాద ఘటనకు చాలాకాలం ముందు విజరుకు చెందిన పార్టీ తమిళగ వెట్రి కజగం(టివికె) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమ ప్రచారం కోసం పోలీసులు విధించిన కఠినమైన ఆంక్షల గురించి ఫిర్యాదు చేయడం, వివిధ వ్యక్తులు దాఖలు చేసే అనేక ఇతర పిటిషన్లు, రాజకీయ సమావేశాల నిర్వహణను నియంత్రించడానికి మరియు పాల్గనేవారి భద్రతను నిర్థారించడానికి ఎస్‌ఒపి /మార్గదర్శకాలను రూపొందించాలని పట్టుబట్టాయి.
ఎస్‌ఒపి రూపొందించాలని కోర్టులో అనేక పిటిషన్లు దాఖలు కావడంతో, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదట రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ఒక వారం మాత్రమే సమయం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, పౌరసంస్థలు, పోలీస్, ఆరోగ్యం, అగ్నిమాపక, సహాయక విభాగాలు వంటి బహుళ సంస్థలను సంప్రదించాల్సి ఉంటుందని ఎఎజి కోర్టుకు తెలిపారు. దీంతో ముసాయిదాను రూపొందించడానికి పది రోజుల సమయం ఇస్తున్నట్లు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
టివికె తరపున వాదించిన సీనియర్ న్యాయవాది వి.రాఘవాచారి మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసులను రాజకీయ ప్రచారాలకు చాలా ముందుగానే అనుమతి ఇవ్వాలని ఆదేశించాలని, ఈ లోపు సంబంధిత పార్టీలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి తగినంత సమయం ఉంటుందని అన్నారు. సెప్టెంబర్ 27న జరగనున్న కరూర్ బహిరంగ కార్యక్రమానికి ఒకరోజు ముందు అనుమతి మంజూరైందని అన్నారు.



