Monday, October 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాకు సాయాన్ని అడ్డుకుంటున్న ఇజ్రాయిల్‌

గాజాకు సాయాన్ని అడ్డుకుంటున్న ఇజ్రాయిల్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇజ్రాయిల్‌, హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ప్రకటించి రెండు వారాల పైనే అయినప్పటికీ గాజాలో మానవతా పరిస్థితి మరింత దిగజారింది ఇప్పటికీ పాలస్తీనియన్లు ఆహారం, తాగునీరు, ఇంధనం మరియు తగిన ఆశ్రయం లేక ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) నిబంధనలను ధిక్కరిస్తూ.. ఇజ్రాయిల్‌ గాజాలోకి సాయాన్ని రాకుండా అడ్డుకుంటోంది. కాల్పుల విరమణతో గాజాలోని తమ నివాసాలకు తిరిగి వస్తున్న పాలస్తీనియన్లు పేలని మందుగుండు సామగ్రితో తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయిల్‌ సైన్యం వదిలి వెళ్లిన పేలుడు పదార్థాల కారణంగా సుమారు 53మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు గాజాలో మిగిలిన 13మంది ఇజ్రాయిల్‌ బందీల మృతదేహాల కోసం హమాస్‌ గాలిస్తోంది. ఇజ్రాయిల్‌ సైనిక నియంత్రణ రేఖ వెంబడి వెతికేందుకు రెడ్‌ క్రాస్‌ మరియు ఈజిప్ట్‌ బృందాలతో కలిసి పనిచేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -