Tuesday, October 28, 2025
E-PAPER
Homeసినిమాట్రెండింగ్‌లో 'మీసాల పిల్ల..'

ట్రెండింగ్‌లో ‘మీసాల పిల్ల..’

- Advertisement -

చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రిలీజైన ఫస్ట్‌ సింగిల్‌ ‘మీసాల పిల్ల’తో చిరు ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్‌ మెలోడీ ఇన్‌స్టంట్‌ చార్ట్‌బస్టర్‌గా మారడమే కాకుండా, తెలుగు పాటకు దేశవ్యాప్తంగా అరుదైన ఘనతను సాధించడం విశేషమని మేకర్స్‌ చెబుతున్నారు.
విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ పాట యూట్యూబ్‌ మ్యూజిక్‌ ఇండియాలో నెంబర్‌ 1 స్థానానికి చేరుకుంది. వరుసగా 13 రోజులు అగ్రస్థానాన్ని కొనసాగించి 36 మిలియన్లకు పైగా వ్యూస్‌ సంపాదించింది. ఈ పాట పాన్‌-ఇండియా సంచలనంగా మారింది.
ఈ పాటలోని క్యాచీ హుక్‌ స్టెప్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, అభిమానులు పెద్ద ఎత్తున రీల్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. వెంకటేశ్‌ ఈ చిత్రంలో పూర్తి స్థాయి కీలక పాత్రలో కనిపించనుండటం సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో శరవేగంగా సాగుతోంది. సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -