రైతులు, విద్యార్థులు ప్రజల ఇబ్బందుల గురించి పోలీసుల అధికారులకు వినతి పత్రం అందజేత.
నవతెలంగాణ – మిరుదొడ్డి
మిరుదొడ్డి మండలం అందే గ్రామంలో ఉన్న సమస్యలను, మిరుదొడ్డి స్థానిక ఎస్సై కి పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గ్రామాలలో ఉన్న సమస్యలను తమకు తెలియజేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకొని అందే గ్రామస్తులు , మిడిదొడ్డి పోలీస్ స్టేషన్కు వెళ్లి వినతిపత్రం అందించారు. అందె గ్రామానికి మూడు వైపులా రోడ్లు ఉంటే మూడు రోడ్లు గుంతల మయంగా ఉండడముతో కళాశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులు రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఈ మారుమూల గ్రామానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అనేక రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నామని తెలియజేశారు.
మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. గ్రామంలోని పాఠశాలలో దేవాలయాల వద్ద మద్యాన్ని సేవించి అపరిశుభ్రత సపవిత్రం చేస్తున్నారని ,అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.రైతులకు సరైన సమయంలో యూరియా అందక వానకాలం సంటలు సరైనా దిగుబడి రాక నష్టం వాటిల్లింది. కనిసం యాసంగి పంటలకు అయినా సరైన సమయనికి యూరియా ఇతర వ్యవసాయ పనిముట్లు అందించి, రైతులకు న్యాయం చేసే విధంగా వాటికి సంబంధించిన అధికారులకు మీ ద్వారా తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారాల రాజకుమార్ కన్వీనర్, జేఏసీ సభ్యులు ప్రవీణ్, సత్యం లింగం, కుమార్, యాదగిరి, ప్రవీణ్, శంకర్, అఖిల్, పరశురాములు, పోచయ్య, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.



