- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలనేది తన సంకల్పమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘ఐటీ, ఫార్మా పరిశ్రమలు ఎలాగో.. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే. మీరు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తా. కార్మికుల కష్టాలు తెలియనంతగా నాకు కళ్లు మూసుకుపోలేదు. సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’’ అని అన్నారు.
- Advertisement -



