Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

– భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎమ్మెల్యే సూచనలు
నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ : కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే తెలిపారు.
ఎమ్మెల్యే పేర్కొన్న జాగ్రత్తలు:
వాగులు, కాలువలు, నదులు, చెరువుల వద్దకు వెళ్లరాదు.
గ్రామాధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలి.
నీరు అధికంగా ప్రవహిస్తున్న ప్రాంతాలకు వెళ్లరాదు.
వాగులు, నాలాలు ప్రవహిస్తున్న రహదారులను దాటరాదు.
చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిల భవనాల వద్ద నిలవకూడదు.
కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగలు ముట్టుకోరాదు.
నడుచుకుంటూ వెళ్లేవారు అండర్ డ్రైనేజ్ మెయిన్ హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలి.
రహదారులు చిత్తడిగా ఉన్నందున వాహనాలు నెమ్మదిగా నడపాలి.
అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలి.
ఎమ్మెల్యే ప్రజలు తమ భద్రత కోసం ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణమే స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -