- Advertisement -
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య చర్చలు జరపడానికి భారత్ సన్నద్దం అయ్యింది. ఇరు దేశాల మధ్య నాలుగు రోజులపాటు ఈ వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం భారత ఉన్నతాధికారుల బృందం ఈ నెల 16న వాషింగ్టన్‌కు చేరుకోనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఈ చర్చలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూస్ గోయెల్ నాయకత్వం వహించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్‌తో, వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లూట్నిక్‌తో చర్చలు జరపనున్నారు.
- Advertisement -