– త్వరలో రూ.2.75 లక్షల కోట్ల డివిడెండ్
– రిజర్వ్ బ్యాంక్ ఖజానా ఖాళీ చేసే పనిలో మోడీ సర్కార్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఖజానాను ఖాళీ చేసే పనిలో మోడీ సర్కార్ పడినట్టు తెలుస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25కుగాను కేంద్రానికి ఏకంగా రూ.2.25 లక్షల కోట్ల నుంచి రూ.2.75 లక్షల కోట్లు డివిడెండ్ చెల్లించేందుకు ఆర్బీఐ సిద్దం అవుతోందని టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. ఈ భారీ డివిడెండ్‌ను ప్రస్తుత నెలలోనే ప్రకటించనుందని ఆర్థికవేత్తలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది రూ.2.10 లక్షల కోట్ల డివిడెండ్ అందించింది. ఈసారి దానిని మరింత పెంచనుందనే అంచనాలు వెలుపడుతున్నాయి. ఈ మొత్తం చెల్లిస్తే ఆర్థిక సంవత్సరం 2025-26 కోసం వార్షిక బడ్జెట్‌లో అంచనా వేసిన రూ. 2.2 లక్షల కోట్లు మించిపోతుంది.
రూపాయి మారక విలువను కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రికార్డు స్థాయిలో డాలర్ అమ్మకాలు చేపట్టింది. 2024 సెప్టెంబర్ ముగింపు నాటికి భారత్ వద్ద రికార్డ్ స్థాయిలో 704 బిలియన్ డాలర్ల విదేశీ మారకం నిల్వలున్నాయి. కాగా.. 2024 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 2025 మధ్య రికార్డ్ స్థాయిలో 371.6 బిలియన్ డాలర్లను విక్రయించిందని అంచనా. పెద్ద ఎత్తున నగదు లభ్యత కార్యకలాపాలు చేపట్టింది. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక లోటును తగ్గిస్థాయని, ప్రభుత్వ వ్యయం, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని సైతం పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కేంద్రానికి ఆర్బీఐ బంపర్ ఆఫర్..!
- Advertisement -
- Advertisement -