- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మొంథా తుఫాన్ ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో SDRF, NDRF బృందాలు సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లకు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని. లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని ఆదేశాలు ఇచ్చారు.
- Advertisement -



