Wednesday, May 14, 2025
Homeజాతీయంకోల్‌కతా నుంచి ముంబయి విమానానికి బాంబు బెదిరింపు

కోల్‌కతా నుంచి ముంబయి విమానానికి బాంబు బెదిరింపు

- Advertisement -

కొల్‌కతా: బాంబు బెదిరింపుతో కోల్‌కతా నుంచి ముంబయి వెళ్లాల్సిన ఒక ప్రయివేటు విమానం దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా బయలేరిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ముంబయికి వెళ్లాల్సిన ఇండిగో 6ఇ 5227 విమానం కోల్‌కతా విమానాశ్రయంలో మధ్యాహ్నం 12:00 గంటలకు బయలుదేరాల్సిన ఉంది. అయితే చివరి నిమిషంలో ఒక ప్రయాణీకుడు తనతో పాటు బాంబు తీసుకుని వెళ్తుతునాన్నని బెదిరించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది, మరోసారి ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించారు. విమానాన్ని ఖాళీ చేసి క్షుణంగా తనిఖీ చేయడంతో నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -