నవతెలంగాణ-హైదరాబాద్: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ, భారత్‌లో తన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించ నుంది. రేపు(అక్టోబర్ 30, 31 తేదీల్లో) ముంబైలో డెమో ప్రదర్శనలు నిర్వహించనుంది.
భారత భద్రతా, సాంకేతిక నిబంధనలకు అనుగుణంగా తమ సేవలు ఉన్నాయని నిరూపించేందుకే ఈ డెమోలను నిర్వహిస్తున్నారు. స్టార్‌లింక్‌కు తాత్కాలికంగా కేటాయించిన స్పెక్ట్రమ్‌ను ఉపయోగించి ఈ ప్రదర్శనలు జరపనున్నారు. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (GMPCS) ఆథరైజేషన్ కోసం అవసరమైన షరతులను పాటిస్తున్నామని ప్రభుత్వ సంస్థల ముందు స్టార్‌లింక్ నిరూపించాల్సి ఉంటుంది. ఈ డెమో విజయవంతమైతే, దేశంలో సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది.


