– మండల కేంద్రంలోని పిహెచ్సి ఇతరత్రా పనులకు ఇబ్బందులు
నవతెలంగాణ-బచ్చన్నపేట : మోంధా ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రం నుండి మండల పరిధి బార్డర్ లో ఉన్న సాల్వాపూర్, లింగంపల్లి, పడమటి కేశవపూర్, మనసంపల్లి, కొన్నే, దబ్బగుంటపల్లి, రామచంద్రపురం, ఇటుకలపల్లి, నక్కవానిగూడెం గ్రామాలలోని ప్రజలు మండల కేంద్రానికి రావడానికి మండల కేంద్రంలోని ఎల్లమ్మ టెంపుల్ వద్దనున్న రెండు వాగుల లో లెవెల్ బ్రిడ్జిలు ఉండడం వలన బ్రిడ్జిల పైనుండి వరద నీరు పాడుతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గ్రామాలలోని ప్రజలు మండల కేంద్రంలో ఉన్నటువంటి పీ హెచ్సీ సి , అలాగే వివిధ కార్యాలయాలకు పనుల నిమిత్తం రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నూతన బ్రిడ్జి నిర్మించి మా గ్రామాల అవస్థలను తొలగించండి…. (బండారి బాలకృష్ణ)
బ్రిడ్జి లేకపోవడంతో తమకు దావఖానాకు రావాలన్నా మండల ఆఫీసుకు రావాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వెంటనే నూతన బ్రిడ్జి నిర్మించి మా ఇబ్బందులను తొలగించగలరు.
నూతన బ్రిడ్జి నిర్మించండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



