- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మొంథా తుపాను ప్రభావంతో బుధవారం కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరంగల్-హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొంది వాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉద్ధృతంగా ప్రవహించడంతో వరంగల్ నుంచి హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సంతోషిమాత కాలనీ, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
- Advertisement -



