– మండలంలో హై లెవెల్ బ్రిడ్జిలు లేకపోవడమే ప్రధాన కారణం
– పత్తి వరి పంట వర్షార్పణం
నవతెలంగాణ-గన్నేరువరం: తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండల కేంద్రం లోని ఊర చెరువు మత్తడి వద్ద ప్రవాహ తీవ్రత అధికంగా ఉండడంతో గన్నేరువరం కు రాకపోకలు నిలిచిపోయాయి. పారువెల్ల , జంగపల్లి గ్రామాలలో ఉన్న లో లెవెల్ కల్వర్టుల పై నుండి వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అకాల వర్షంతో ఐకెపి కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వేల ఎకరాలలో పత్తి ,వరి పంట వాన తాకిడికి గురైంది.ఎస్సై జి. నరేందర్ రెడ్డి వరద ఉధృతిని పరిశీలించి ప్రజల రాకపోకలను నివారించడానికి బార్కేడ్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ఉధృతి తగ్గేవరకు వరద నీటి గుండా ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దని మండల ప్రజలకు సూచించారు. లో లెవెల్ కల్వర్టుల స్థానంలో బ్రిడ్జిలు నిర్మించాలని మండల ప్రజలు మొరపెట్టుకున్నప్పటికీ కాంట్రాక్టర్ బ్రిడ్జిలు నిర్మించకపోవడంతో నే ఈ పరిస్థితి దాపురించిందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముందుగా హైలేవేల్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికైనా వేగంగా తూకం ప్రక్రియ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
గన్నేరువరంకు రాకపోకలు బంద్
- Advertisement -
- Advertisement -



