నవతెలంగాణ-షాద్ నగర్ రూరల్ : మానవత్వం మంటగలుస్తోంది కళ్ళు కూడా తెరవని నవజాత శిశువును కనికరం లేని కసాయి పరులు చెట్ల పొదల్లో విడిచి వెళ్లారు ఓ పక్క వర్షం చల్లని గాలులకు ఆ నవజాత శిశువు గుక్కపెడుతూ ఏడుస్తూ నేనేమి చేశాను పాపం నాకెందుకు ఈ శిక్ష అనే హృదయ విధారకర సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం చౌదర్ గూడెం మండలం పరిధిలోని మల్కపహాడ్ గ్రామ శివారులో వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును అర్ధరాత్రి చెట్ల పొదల దగ్గర వర్షంలో మూర్ఖ శిఖామణులు వదిలి వెళ్లారు రాత్రి ఆ చిన్నారి నవజాత శిశువు రోదనను గమనించిన పలువురు శిశువును చేరదీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని శిశువుకు వైద్య పరీక్షలు జరిపి శిశువిహార్ కి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తప్పులు చేసి మానవత్వాన్ని మంట కల్పేలా సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. క్షణిక సుఖ తప్పిదాలు మీరు చేసే అభం శుభం తెలియని నవజాత శిశువును శిక్షించడం పట్ల మానవతా అవార్డులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కారకులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలను కోరుతున్నారు .
చెట్ల పొదల్లో నవ జాత శిశువు…
- Advertisement -
- Advertisement -



