Thursday, October 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపొంగిపొర్లుతున్న ఆకేరు  పాలేరు మున్నేరు వాగులు

పొంగిపొర్లుతున్న ఆకేరు  పాలేరు మున్నేరు వాగులు

- Advertisement -

– రెండో రోజు విద్యాసంస్థలు సెలవులు 
– మానుకోటలో వరి పంటలకు భారీ నష్టం 
– స్తంభించిన రాకపోకలు 
నవతెలంగాణ-మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో వరద ఉద్ధృతి కొనసాగుతుంది. రెండో రోజు గురువారం మానుకోట జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు డిఇఓ దక్షిణామూర్తి సెలవులు ప్రకటించారు. మోందా తుఫాన్ ఎఫెక్ట్తో ఆఖరు మున్నేరు పాలేరు వాగుల పరివాహకంలో  వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటిమరిగాయి. మహబూబాబాద్ కు ఖమ్మం వరంగల్ హైదరాబాద్ కు రాకపోకలు స్తంభించాయి. వర్షం బుధవారం సాయంత్రం నుంచి నిలిచిపోయినప్పటికీ వరంగల్లో కురిసిన భారీ వర్షాల వరద ల మూలంగా మానుకోటలో పాలేరు ఆటేరుల మూలంగా మానుకోటలో పాలేరు ఆకేరు  మున్నేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి.  మహబూబాబాద్ – నర్సంపేట రహదారిలో మానుకోట శివారులో ఉన్న జమల పెళ్లి వద్ద బ్రిడ్జి పైనుంచి నీళ్లు  వెళుతుండడంతో సిఐ గట్ల మహేందర్ రెడ్డి ట్రాఫిక్ ను నిలిపివేశారు .  గత రెండు రోజులుగా అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది వరంగల్ కు రాకపోకలు స్తంభించిపోయాయి.  మహబూబాబాద్ కే సంద్రం రహదారిలో ఈదుల పూసపెల్లి వద్ద రాళ్లవాగు పొంగిపొర్లు పోలీసులు రాకపోకలు నిలిచి పోయాయి. మహబూబాబాద్ తొర్రూర్ వెళ్లే రహదారిలో నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామం వద్ద ఆలేరు చెరువు పొంగి పొలడంతో రోడ్డు పైనుంచి నీళ్లు పోతున్నడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.  మహబూబాబాద్ ఖమ్మం వెళ్లే రహదారిలో ములకలపల్లి వద్ద పాలేరు వాగు పొంగిపొర్లు తొండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.  మహబూబాబాద్   ప్రజలతో ఇతర ప్రాంతాలు ఖమ్మం వరంగల్ నర్సంపేట హైదరాబాద్ తో తొర్రూరు నెల్లికుదురు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.  భారీ వర్షాల మూలంగా విజయవాడ టు హైదరాబాద్ వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్ ను రద్దు చేశారు. ఇతర గౌతమి చార్మినార్ కోణార్క్ గోల్కొండ సింగరేణి  రైలు నడుస్తున్నాయి.  గురువారం వర్షం పూర్తిగా వెలిసినప్పటికీ ఆ పేరు పాలేరు మున్నేరు వాగులు పొంగి పొల్లడంతో ట్రాఫిక్ ని నిలిచిపోయింది. రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు .  మహబూబాబాద్ వేసేమహబూబాబాద్ వేసే మార్కెట్లో స్వల్పంగా మొక్కజొన్నలు తడిచాయి. మానుకోట  వ్యవసాయ మార్కెట్ కు 30, 31, నవంబర్ 1, నవంబర్ 2 తేదీల్లో సెలవులు ప్రకటించారు. పెద్ద గూడూరు మండలం గాజుల గట్టు గ్రామంలో ఇంటి గోడ కూలి గాజుల రామక్క 65 అని వృద్ధురాలు మృతి చెందారు.  పోలీసులు మున్సిపల్ గ్రామపంచాయతీ సిబ్బంది అనునిత్యం ప్రజలకు సేవలు అందించడం మునిగిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -