Thursday, October 30, 2025
E-PAPER
Homeజిల్లాలుడాక్టరేట్ అందుకున్న రైతుబిడ్డ

డాక్టరేట్ అందుకున్న రైతుబిడ్డ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
ఆలూరు మండల కేంద్రానికి చెందిన ఇస్సపల్లి పోతన్నకు గురువారం  ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర విభాగం డాక్టరేట్ ప్రకటించింది. “మధ్యయుగ దక్కన్ పాలకులు – సైనిక వ్యవస్థ (1000-1724)” అనే అంశంపై పోతన్న పరిశోధన జరిపారు. ఈ పరిశోధనకు ప్రొఫెసర్ జి.అంజయ్య గైడ్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం పోతన్న తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్, భీక్నూర్‌లోని చరిత్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ప్రాథమిక విద్యను ఆలూరులో, డిగ్రీని నిజామాబాద్ గిరిరాజ్ కాలేజీలో, పీజీ మరియు పి.హెచ్.డి.ను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు.

తన విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగిందని, డాక్టరేట్ పొందడం జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పోతన్న తెలిపారు. తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, గురువులకు జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా నవతెలంగాణకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -