– చైనా-సెలాక్ సమావేశంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు
బీజింగ్: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొంటున్న వేళ అన్ని దేశాలు సమైక్యంగా నిలబడాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపిచ్చారు. ప్రపంచ శాంతి సుస్థిరతలను పరిరక్షించడానికి అన్ని దేశాలు కలిసి మెలిసి పనిచేస్తూ, ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వుందన్నారు. టారిఫ్‌ల యుద్ధంలో విజేతలంటూ ఎవరూ వుండరని పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్య లు చేశారు. బెదిరింపులు, గుత్తాధిపత్యం వంటి ధోరణులు ఏకాకి కావడానికే దారి తీస్తాయని హెచ్చరించారు. ఈనాడు ప్రపంచం పెను మార్పు లకు గురవుతోంది. ఒకదాని వెనుక మరొకటిగా అనేక ముప్పులు తలెత్తుతునే వున్నాయన్నారు. సంఘీభావం, సహకారం ద్వారా మాత్రమే మనం ప్రపంచ శాంతి సుస్థిరతలను కాపాడుకోగలమ న్నారు. 30కి పైగా లాటిన్ అమెరికా, కరేబియా దేశాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ ప్రసంగించారు.
సెలాక్ నేతలతో వాంగ్ భేటీ
బీజింగ్‌లో జరుగుతున్న చైనా-సెలాక్ నాల్గ వ మంత్రిత్వ స్థాయి సమావేశంలో పాల్గొన్న దేశా ల్లో కొన్ని దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధు లతో చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి భేటీ అయ్యారు. చైనా-క్యూబా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ఇరు దేశాల అధ్యక్షులు అర్ధవంతమైన చర్చలు జరిపారని తెలిపారు. పెరూ, వెనిజులా, గుయాన్, క్యూబా, కొలంబియా, నికారాగ్వా తదితర దేశాల నేతలతో వాంగ్ చర్చలు జరిపారు. చైనా, వెనిజులా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం వుందని చెప్పారు.
కాల్పుల విరమణను స్వాగతించిన చైనా
నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధమని వెల్లడి
భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణకు మద్దతిస్తూ, చైనా సోమవారం ఆ పరిణామాన్ని స్వాగతించింది. సమగ్రమైన రీతిలో, శాశ్వత కాల్పుల విరమణను సాకారం చేయడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాము సిద్ధంగా వున్నామని చైనా తెలిపింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలు వల్ల రెండు దేశాల ప్రాధమిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేరతాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్‌జియాన్ వ్యాఖ్యానించారు. పైగా ఈ కాల్పుల విరమణ వల్ల ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి సానుకూల వాతావరణం నెలకొంటుందన్నారు. అంతర్జాతీయ సమాజం సాధారణ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడానికి వెసులుబాటు వుంటుందన్నారు. బీజింగ్‌లో సాధారణంగా నిర్వహించే పత్రికా సమావేశంలో లిన్ జియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్‌లు ఇరుగు పొరుగు దేశాలని, వాటిని ఒకదాన్నుండి మరొకటిని వేరు చేయలేమని, ఆ రెండు చైనాకు పొరుగు దేశాలని వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్తాన్‌ల్లో ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన వేళ, చైనా సంబంధిత పక్షాలతో సన్నిహితంగా చర్చలు జరుపుతునే వుందన్నారు. ప్రశాంతత పాటించి, సంమయనం వహించి, పరిస్థితులు పెచ్చరిల్లకుండా చూడాలని కోరినట్లు ఆయన చెప్పారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. రాజకీయ పరిష్కార పంథాకు రావాల్సి వుందన్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలను పరిరక్షించడానికి కృషి చేస్తుందన్నారు.
బెదిరింపులు, గుత్తాధిపత్య ధోరణులతో ఒంటరౌతారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES