Wednesday, May 14, 2025
Homeతాజా వార్తలుకొన ఊపిరితో 16 గంటలకు పైగా మహిళ..

కొన ఊపిరితో 16 గంటలకు పైగా మహిళ..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ మహిళ 16 గంటలకు పైగా రోడ్డు పక్కన తుప్పల్లో అచేతన స్థితిలో గడిపింది. ఆ మార్గంలో వెళ్లేవారు కొందరు చూడటంతో ఆమె ప్రాణాలు దక్కాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తుర్పుగోదవరి జిల్లా అల్లవంర మండలంలోని ఓ మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో అల్లవరం సడక్‌ రోడ్డు సత్తెమ్మతల్లి గుడి సమీపంలో తుప్పల్లో ఓ మహిళ అపస్మారక స్థితిలో తలపై గాయంతో పడి ఉండటం స్థానికులు గమనించారు. 112 నంబరుకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళగా(30)గా గుర్తించారు. గోసంగివారి పేటకు చెందిన ఓ వ్యక్తి సోమవారం రాత్రి తనను తీసుకువెళ్లి దాడి చేసినట్లు ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చిన తర్వాత చెప్పినట్లు సమాచారం. అత్యాచారం జరిగిందా? అనే విషయం వైద్య పరీక్షల్లో తేలనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -