Saturday, November 1, 2025
E-PAPER
Homeక్రైమ్సామినేని హత్య..ఘటనా స్థలానికి సీపీ

సామినేని హత్య..ఘటనా స్థలానికి సీపీ

- Advertisement -

నవతెలంగాణ – ఖమ్మం: చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సినియర్ నాయకులు సామినేని రామారావుని శుక్రవారం తెల్లవారుజామున కాంగ్రెస్ గుండాలు అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన విషయం తెలిసిందే . విషయం తెలిసిన వెంటానే సంఘటన స్థలానికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేరుకున్నారు. కమిషనర్ కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, డివిజన్ కార్యదర్శి మేడిపల్లి గోపాలరావు వివరాలు తెలియజేశారు.
ఈ సంఘటనపై సీపీ స్పందిస్తూ .. సామినేని రామారావు హత్య కేసు విచారణ చేస్తున్నాము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి హంతకులను పట్టుకుంటామని తెలిపారు. అనవసర పుకార్లు ప్రచారం చేయవద్దు అని సిపీ అన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. ఈ రోజు తెల్లవారుజామున కాంగ్రెస్ గుండాలు రామారావుని దారుణగా హత్య చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పాతరపాడు గ్రామపంచాయతీలో ఓడిపోతామని భయంతోనే కాంగ్రెస్ గుండాలు అత్యంత కిరాతకంగా కాపు కాసి హత్య చేశారని ఆయన ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -