నవతెలంగాణ-హైదరాబాద్: మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నిలో రెండో సెమిఫైనల్‌లో ఆసీస్‌పై ఇండియా టీం అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 9 బంతులుండగానే ఛేదించింది. జెమీమా అజేయసెంచరీ (127: 134 బంతుల్లో 14 ఫోర్లు)తో మ్యాచ్‌ను గెలిచింది. తాజాగా దేశవ్యాప్తంగా మహిళల టీమిండియాపై ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
టీమిండియాను చూసి దేశం గర్విస్తోందని అగ్ర దర్శకుడు రాజమౌళి అభినందనలు తెలిపారు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. సైమీస్‌లో కంగారూలను చిత్తు చేసి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. దీంతో హర్మన్‌ప్రీత్ సేనపై సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశం గర్వించేలా చేశారంటూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
”అద్భుతమైన భారత మహిళా క్రికెట్ జట్టుకు హఅదయపూర్వక అభినందనలు. ఎంతో ధైర్యంతో చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ ఛేదించలేని స్కోరు మీరు ఛేదించి దేశం గర్వపడేలా చేశారు. ఫైనల్లో మరోసారి చరిత్ర సృష్టించండి” – ప్రముఖ దర్శకులు రాజమౌళి
”టీమిండియా.. అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. సైమీఫైనల్లో రికార్డు స్కోరును ఛేదించడం చిన్న విషయం కాదు. జెమీమా, హర్మన్ ప్రీత్, రిచా, దీప్తి అందరూ గొప్పగా ఆడారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇదే ఉత్సాహంతో ట్రోఫీని తీసుకురండి” – హీరో వెంకటేష్
”నిజంగా ఇది గొప్ప వార్త.. మనం ఫైనల్స్‌కు చేరాం. టీమిండియాకు అభినందనలు” – హీరోయిన్ లావణ్య త్రిపాఠి
”కలలు కనండి.. మిమ్మల్ని మీరు నమ్మండి.. విజయాన్ని సాధించండి.. నిజమైన ఛాంపియన్లు ఎలా ఉంటారో మన మహిళలు ప్రపంచానికి చూపించారు. సరికొత్త చరిత్ర సృష్టిస్తూ భారత్ ఫైనల్‌లో అడుగుపెట్టింది” – హీరో సోనూసూద్
”ఇవి భారత్‌కు గొప్ప క్షణాలు. ఉత్కంఠభరితమైన విజయంతో మన మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకుపోయింది. దఅఢ సంకల్పం, ఐక్యత, ప్రతిభ అన్నిటితో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. శుభాకాంక్షలు” – హీరో రిషబ్ శెట్టి

 
                                    