Saturday, November 1, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో మెరుగుప‌డుతున్న వాయునాణ్య‌త

ఢిల్లీలో మెరుగుప‌డుతున్న వాయునాణ్య‌త

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటికంటే ఈరోజుకి గాలి నాణ్యతలు కొంత మెరుగుపడ్డాయి. అయినప్పటికీ గాలి నాణ్యతలు పేలవంగానే నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) పేర్కొంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు 268 ఎక్యూఐ నమోదైంది. దీంతో ఎక్యూఐ స్థాయిల్ని ‘పూర్‌’ కేటగిరీగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వర్గీకరించింది.

గురువారం ఎక్యూఐ 373గా నమోదవ్వడంతో వెరీ పూర్‌ కేటగిరీగా వర్గీకరించింది. శుక్రవారం నాటికి గాలి నిణ్యతలు మెరుగుపడి వెరీపూర్‌ కేటగిరి నుంచి.. పూర్‌ కేటగిరిలో ఎక్యూఐ స్థాయిలు నమోదయ్యాయి.
కాగా, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డెవలప్‌ చేసిన సమీర్‌ యాప్‌ ఢిల్లీలో 12 ప్రాంతాల్ని రెడ్‌ జోన్లు ఉన్నాయని తెలిపింది. వజీర్‌పూర్‌లో 355, బవానాలో 349 ఎక్యూఐ నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -