నవతెలంగాణ-హైదరాబాద్: ఇండో-చైనా బార్డర్‌లో భారీగా మంచుతో కూడిన వర్షం కురుస్తోంది. ఇరుదేశాల మధ్య ఉన్న నాస్‌లా పాస్ ప్రాంతంలో భారీ మొత్తంలో మంచు కొండలు ఏర్పడ్డాయి. అదే విధంగా సిక్కిం సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో లోయప్రాంతాల్లో ఉన్న పలు ప్రాంతాల మార్గాలు మంచు కారణంగా మూసుకుపోయాయి. మంచు ప్రాంతాలకు అతి దగ్గరగా ఉన్నా సిక్కంలోని పలు ప్రాంతాలు ఉష్ణోగ్రతలు సున్నా స్థాయికి పడిపోయాయి. అప్రమత్తమై సిక్కం ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. మంచు వర్షం ప్రభావం ఉన్నా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నాథులా, కుప్పు, చీనాగ్ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మంచువర్షం కురిసిందని భారత్ వాతావరణ శాఖ(IMD ) పేర్కొంది.
సిక్కింలో రాబోయే 24 గంటల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని IMD పేర్కొంది. పర్యాటకులు, వాహనాదారులు ఎత్తైన ప్రాంతాలకు ప్రయాణించకుండా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) బృందాలు మంచును తొలగించడానికి, అవసరమైన కనెక్టివిటీని నిర్ధారించడానికి నిరంతరం పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విపత్తు ప్రతిస్పందన బృందాలను సిద్ధంగా ఉంచగా, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నివాసితులను కోరారు.

 
                                    