నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని ఇండియా దిగుమతులపై అదనపు సుంకాలు విధించారు. భారతీయ ఉద్యోగులే లక్ష్యంగా H-1B వీసా రూల్స్ కఠినతరంగా చేశారు. ఇండియా ఆధిక్యత ప్రదర్శిస్తున్న ఫార్మా, సినిమా, ఐటీ సెక్టార్ తదితర రంగాలను దెబ్బతీయడానికి ట్రంప్ సర్కార్ కుట్రలు పన్నుతోంది. తాజాగా H-1B వీసాల రూపంలో భారతీయులు అమెరికన్ల కలలను అడ్డుకుంటున్నారని ఓ యాడ్ రూపొందించారు. ఈమేరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోని కార్మిక శాఖ సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రకటనను విడుదల చేసింది. కంపెనీలు H-1B వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, యువ అమెరికన్ వర్కర్లకు ఉద్యోగాలు లేకుండా విదేశీయులను రిక్రూట్ చేసుకుంటున్నారని ఆరోపించింది. భారతదేశాన్ని ఈ H-1B వీసా అతిపెద్ద లబ్ధిదారుడిగా నేరుగా ఆరోపించింది.
ఎందుకంటే H-1B వీసాను దుర్వినియోగం చేయడం వల్ల ఉద్యోగాలను విదేశీ వర్కర్లచే భర్తీ చేస్తు్న్నారు. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు, కార్యదర్శి లోరీ చావెజ్-డిరెమెర్ నాయకత్వంలో, మేము కంపెనీలను వారి దుర్వినియోగానికి జవాబుదారీగా ఉంచుతున్నాము. అమెరికన్ ప్రజల కోసం అమెరికన్ డ్రీమ్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాము.’’ అని పేర్కొంది. H-1B వీసా సమ్మతిని ఆడిట్ చేయడానికి సెప్టెంబర్ 2025లో యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ‘‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’’ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా అమెరికన్ కార్మికులను టెక్, ఇంజనీరింగ్ ఉద్యోగాల్లో, తక్కువ జీతం ఉన్న విదేశీ నిపుణులతో భర్తీ చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. H-1B వీసా అప్రూవల్స్‌లో 72 శాతం భారతీయులకే దక్కుతున్నాయని అమెరికా పేర్కొంది.
ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ ద్వారా ఈ వీసా దుర్వినియోగానికి కంపెనీలను జవాబుదారీగా ఉంచడానికి, నియామక ప్రక్రియలో అమెరికన్లకు ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకోవడానికి, అమెరికన్ల కలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని లేబర్ డిపార్ట్మెంట్ పేర్కొంది.

 
                                    