Saturday, November 1, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవిరిగిప‌డిన కొండచరియలు..21 మందికి పైగా మృతి

విరిగిప‌డిన కొండచరియలు..21 మందికి పైగా మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ద్వీప దేశమైన పపువా న్యూగినియాలోని ఎత్తైన ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడి 21 మందికి పైగా మృతి చెందారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మీడియా నివేదించింది. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. ఎంగా ప్రావిన్స్‌లోని కుకాస్‌ గ్రామంలోని ప్రజలు నిద్రిస్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడడంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి.

ఈ శిథిలాల కిందే ప్రజలు సమాధి అయ్యారని స్థానిక పోలీసులు మీడియాకు తెలిపినట్లు ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (ఎబిసి) పేర్కొంది. ఎంగా గవర్నర్‌ పీటర్‌ ఇపాటాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో 30 మంది స్థానికులు మృతి చెందారు. ఇప్పటికే 18 మంది మృతదేహాలను వెలికితీశారు అని చెప్పారు. పోలీసులు మాత్రం మృతుల సంఖ్య 21 అని మాత్రమే మీడియాకు చెప్పారు. సహాయాన్ని అందించమని పపువా న్యూగినియాకు ఐక్యరాజ్యసమితి మానవతా సలహాదారుగా ఉన్న మేట్‌ బాగోస్సి మాత్రం తక్షణమే స్పందించలేదు.

కాగా, గతేడాది మేలో ఎంగాలో కొండచరియలు విరిగిపడడంతో 670 మంది గ్రామస్తులు మృతి చెందారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అయితే పపువా న్యూగినియా ప్రభుత్వం రెండు వేల మందికిపైగా శిథిలాల కిందే సమాధి అయ్యారని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -