Wednesday, May 14, 2025
Homeఅంతర్జాతీయంపేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాన్ని మార్చలేరు: ఇండియా

పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాన్ని మార్చలేరు: ఇండియా

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ అంశంలో చైనా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును భార‌త్ మ‌రో సారి ఖండించింది. భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలు చేస్తుంద‌ని మండిప‌డింది. అలాంటి ప్రయత్నాలను భార‌త్ తీవ్రంగా ఖండిస్తుంద‌ని, అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమ‌ని నొక్కి చెప్పింది. ఆ ప్రాంతం భారత్ లో విడదీయరాని భాగమని.. పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని మార్చలేరని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ స్పష్టం చేశారు. గ‌త ఏడాది ఏప్రిల్‌లో రెండు దేశాలు అనేక ప్రాంతాల‌కు పేర్లు పెట్టాయి. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఉన్న కొన్ని ప‌ట్ట‌ణాల‌క చైనా పేర్లు పెట్టింది. దీనికి బ‌దులుగా టిబెట్‌లో ఉన్న 30 ప్రాంతాల‌కు ఇండియా పేర్లు పెట్టిన విష‌యం తెలిసిందే. పేర్లు పెట్టే ప్ర‌క్రియ‌తో చైనా రాజ‌కీయం చేస్తున్న‌ట్లు ఇండియా ఆరోపించింది. అంత‌ర్జాతీయ చ‌ట్టాలు, ద్వైపాక్షి ఒప్పందాల ప్ర‌కారం ఆ ప్ర‌క్రియ నిల‌వ‌ద‌న్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -