నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్టులు పీవీ శ్రీనివాస్, అయోధ్య రెడ్డి, న్యాయవాదులు దేశాల భూపాల్, మోహిసినా పర్వీన్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో వారితో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి.చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ కె. రామకృష్ణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీఐ కమిషనర్లకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు లేదా వయసు 65 ఏళ్లు నిండే వరకు వారు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా కొనసాగుతారు. కాగా తెలంగాణలో గత కొంత కాలంగా ఆర్టీఐ కమిషన్ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో ఇటీవలే కమిషన్ నియామకాన్ని ప్రభుత్వంరాష్ట్ర సమాచార కమిషనర్లుగా నలుగురు ప్రమాణ స్వీకారం చేపట్టింది. ఆర్టీఐ ప్రధాన సమాచార కమిషనర్ గా ఐఎఫ్ఎస్ అధికారి జి.చంద్రశేఖర్ రెడ్డి గత శుక్రవారమే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నలుగురు ప్రమాణ స్వీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES