- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గాజా పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున ఉత్తర గాజాలోని ఇళ్లపై ఇజ్రాయెల్ ఫోర్స్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం 48 మంది మరణించినట్లు జబాలియాలోని ఇండోనేషియా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 22 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపాయి.
- Advertisement -