Sunday, November 2, 2025
E-PAPER
Homeజాతీయంరేపు ఎల్‌వీఎం3–ఎం5 ప్రయోగం.. 

రేపు ఎల్‌వీఎం3–ఎం5 ప్రయోగం.. 

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. అత్యంత బరువైన పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లే ఎల్‌వీఎం3-ఎం5 (Mark3) రాకెట్‌ను సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ప్రయోగించనుంది. దీనిద్వారా ద్వారా సీఎంఎస్‌–03 సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం 3.26 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనుంది. అంటే 25.30 గంటల కౌంట్‌డౌన్‌ కొనసాగనుంది.

అనంతరం 4,400 కిలోల బరువు కలిగిన సీఎంఎస్‌–03 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని మోసుకుని నింగిలోకి దూసుకెళ్లనుంది. 16.09 నిమిషాల అనంతరం ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెడతారు. కాగా, 4,400 కిలోల బరువైన సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించడం ఇదే మొదటిసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -