Saturday, November 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతక్కువ ధరకే బంగారం..రూ. 25 లక్షలతో డీల్!

తక్కువ ధరకే బంగారం..రూ. 25 లక్షలతో డీల్!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పల్నాడు జిల్లా నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 25 లక్షలతో ప‌రార‌య్యారు. కోటప్పకొండ యూటీ దగ్గర డీల్ మాట్లాడుదాం అని రమ్మని పిలిచిన కేటుగాళ్ళు.. దీంతో రూ. 25 లక్షలు తీసుకుని కోటప్పకొండ యూటీ వద్దకు శ్రీ గణేష్ వెళ్ళాడు. అనంతరం కోటప్పకొండ యూటీ వద్దకు రాగానే ముందు స్వామి వారి దర్శనం చేసుకోవాలి అంటూ అతడ్ని బురిడీ కొట్టించారు. అలాగే, పోలీసులుగా జీపులో వచ్చి నగదు బ్యాగుని చెక్ చేయాలని చెప్పిన మోసగాళ్ళు.. నిజమైన పోలీసులే వచ్చారు అనుకొని రూ. 25 లక్షల బ్యాగ్ ను బాధితుడు శ్రీ గణేష్ ఇచ్చాడు.

అయితే, బ్యాగ్ తీసుకుని సినీ ఫక్కీలో దుండగులు పారిపోయారు. ఊహించని ఘటనతో ఒక్కసారిగా ఖంగుతిన్న బాధితుడు శ్రీ గణేష్.. నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మిత్రుడు నరేష్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నరేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -