నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన ఈ తొలి కేబినెట్ మీటింగ్ లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ప్రోత్సాహమిచ్చేలా ఆమోదం లభించింది. యూపీలోని జేవర్లో 6వ సెమీ కండక్టర్ యూనిట్ ను నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకు రూ.3,706 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గుజరాత్ లోని సనంద్ లో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు రూ.3,300 కోట్లు, చంద్రయాన్ -4 మిషన్ కు రూ.2,104 కోట్లు, మిషన్ వీనస్ కు రూ.1236 కోట్లు, డెవలప్ మెంట్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కు రూ.8,240, గగన్ యాన్ ఫాలోకు రూ.20,193 కోట్లు, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ హాన్స్మెంట్ స్కీమ్ కు రూ.2,254 కోట్లు, విగ్యాన్ ధారకు రూ.10,579 కోట్లు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ క్రియేటివ్ టెక్నాలజీస్ కు రూ.391 కోట్లు, బయో E3 పాలసీ ఫర్ బయో మాను ఫ్యాక్చరింగ్ కు రూ.1500 కోట్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ స్పేస్ సెక్టార్ అండర్ ఏజిస్ ఆఫ్ IN-SPACeకు రూ.1000 కోట్లు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితోపాటు బెంగళూరు, నోయిడాలో చిప్స్ హబ్స్ ఏర్పాటుకు, తిరుపతిలో ఐఐటీ విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
- Advertisement -
- Advertisement -