Sunday, November 2, 2025
E-PAPER
Homeక్రైమ్కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటకల్ క్రాస్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకెళ్తున్న ఆటోకు టెంపో ఢీ కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్ర‌మాదంలో మ‌రో 10 మందికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. గాయ‌ప‌డిన వారిలో ఆరుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇటీవ‌లే కర్నూలు జిల్లాలో కావేరీ ట్రావెల్స్ బ‌స్సు ప్ర‌మాదానికి గురై 19 మంది మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఇది దేశంలోనే అత్యంత ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. ప్రధాని మోడీ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఇక నెల రోజులు తిరగకుండానే మరోసారి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -