Sunday, November 2, 2025
E-PAPER
Homeమహబూబ్ నగర్పశు వైద్యం పట్ల రైతులు శ్రద్ధ చూపాలి 

పశు వైద్యం పట్ల రైతులు శ్రద్ధ చూపాలి 

- Advertisement -

– జిల్లా అధికారి జ్ఞాన శేఖర్ 
నవతెలంగాణ – బల్మూరు 
పశువులలో ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా వివిధ రోగాలు వచ్చే అవకాశం ఉందని, పశువులకు వైద్యం పట్ల రైతులు శ్రద్ధ చూపాలని జిల్లా పశు సంవర్ద శాఖ అధికారి డాక్టర్ జ్ఞాన శేఖర్ అన్నారు. మండలంలో నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాల ను శనివారం ఆకస్మికతనికి నిర్వహించారు. రాంనగర్ తోడేళ్లగడ్డ సీతారాంపూర్ గ్రామాలలో పశువులకు అందిస్తున్న వైద్య సేవలపై విచారణ చేశారు. పశువులలో సోకే గాలికుంటు వ్యాధులకు టీకాలు తప్పకుండా రైతులు వేయించాలని సూచించారు. పశువుల తో పాటు గేదెల మేకలు గొర్రెలకు వ్యాధికి తగిన మందులను ఉచితంగా ఉండాలని అదేవిధంగా టీకాలు కూడా వేయించాలని రైతులకు సూచించారు. గత 25 రోజులుగా మండలంలో పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని గ్రామాల రైతులు గాలికొంటూ టీకాలు పశువుల తెప్పిస్తున్నారని బల్మూరు మండల పశువైద్యాధికారి అనిల్ వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మహేశ్వరి పారా వెటర్నరీ సిబ్బంది కిషోర్, మంజుల, వెంకటయ్య, కరీం గోపాలమిత్ర సభ్యులు ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -