Thursday, May 15, 2025
Homeజాతీయం‘భార్గవస్త్ర’ పరీక్ష విజయవంతం

‘భార్గవస్త్ర’ పరీక్ష విజయవంతం

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆపరేషన్ సిందూర్ స‌క్సెస్‌తో జోష్ మీదున్న ఇండియా..తాజాగా బుధవారం స్వదేశీ శక్తితో రూపొందించిన అత్యంత శక్తివంతమైన ‘భార్గవస్త్ర’ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలోని గోపాల్‌పూర్ సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ పరీక్ష నిర్వహించింది. ‘హార్డ్ కిల్’ మోడ్‌తో భార్గవస్త్ర కౌంటర్ డ్రోన్ వ్యవస్థను భారత్ ప్రయోగించింది. ఈ పరీక్ష విజయవంతంగా ముగిసింది. ఇటీవల పాకిస్థాన్ విరివిగా డ్రోన్లు ప్రయోగించింది. అలాంటి డ్రోన్ల సమూహాన్ని ఒకేసారి ‘భార్గవస్త్ర’ ధీటుగా ఎదుర్కోగలదు. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL)చే భార్గవస్త్రం అభివృద్ధి చేయబడింది. మే 13న ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్ సీనియర్ అధికారుల సమక్షంలో నిర్వహించిన మూడు పరీక్షల్లో మైక్రో రాకెట్లు అన్ని మిషన్ లక్ష్యాలను ఛేదించగలిగాయి. రెండు పరీక్షల్లో ఒక్కొక్క రాకెట్‌ను ప్రయోగించింది. రెండు సెకన్లలోపు రెండు రాకెట్లను సాల్వో మోడ్‌లో ప్రయోగించడం ద్వారా ఒక ట్రయల్ నిర్వహించబడింది. నాలుగు రాకెట్లు ఊహించిన విధంగా పనిచేశాయి. అవసరమైన ప్రయోగ పారామితులను సాధించాయి. ఇది పెద్ద ఎత్తున డ్రోన్ దాడులను ఎదుర్కోగలిగిన సామర్థ్యం ఉన్నట్లుగా నిరూపించబడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -