Sunday, November 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రూప్ 1 సాధించిన లిటిల్ ఫ్లవర్ పూర్వ విద్యార్థి

గ్రూప్ 1 సాధించిన లిటిల్ ఫ్లవర్ పూర్వ విద్యార్థి

- Advertisement -

నవతెలంగాణ-మిర్యాలగూడ 
పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల పూర్వ విద్యార్థి గ్రూప్ వన్ లో జిల్లా అసిస్టెంట్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించినందుకు శనివారం పాఠశాలలో ఆ విద్యార్థిని ఘనంగా సన్మానించారు. పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి  కొండిపర్తి సత్యవేద గ్రూపు వన్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 269 వ ర్యాంక్ సాధించి, వనపర్తి జిల్లా అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్ గా నియమితులైనారు.ఈ సందర్భంగా ఎంఈఓ  బాలు నాయక్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాల సాధించి తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని కోరారు. పూర్వ విద్యార్థి ఉన్నత ఉద్యోగం సాధించడం పట్ల ఆనందంగా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్ కేకే జయరాజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి,    ట్రస్మ టౌన్ ప్రెసిడెంట్ శ్రీపతి శ్రీనివాస్,   విజేత తల్లి దండ్రులు  కృష్ణమా చారి, శ్రీదేవి  పాఠశాల డైరెక్టర్ కె. కె.జిన్సీ జయరాజన్, హెడ్ మాస్టర్ సుజయ్ కుమార్, ఐ. ఐ. టీ. హెడ్  ఎరగాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -